AP: రాజధాని నిర్మాణమనేది కేవలం ఒక కాంట్రాక్ట్ వర్క్‌గా చూడొద్దని సీఎం చంద్రబాబు అన్నారు. పనులు చేపట్టే వారంతా చరిత్రలో భాగస్వాములవుతున్నట్టే అని తెలిపారు. ‘రాజధాని నగరాన్ని నిర్మించే అవకాశం అందరికీ దక్కదు. రాజధాని ప్రతిష్టను పెంచేలా ఆలోచనలు వస్తే ప్రభుత్వంలో పంచుకోవచ్చు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి నిర్మాణం పూర్తి చేసి తీరాల్సిందే’ అని సీఎం స్పష్టం చేశారు.