TG: ఫ్యూచర్ సిటీపై జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వారిని వేధించడం మానుకోవాలి. రియల్ ఎస్టేట్ వేధింపులు మానుకోకపోతే ఈడీకి ఫిర్యాదు చేస్తాం. GHMC అంటే గుంపు మేస్త్రీ హయాంలో జరగుతున్న కరప్షన్. పాలనతో పాటు అవినీతిపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఫ్యూచర్ సిటీ పేరుతో HYD అభివృద్ధిని అడ్డుకోవద్దు’ అని వ్యాఖ్యానించారు.