TG: సూర్యాపేట జిల్లాకు వచ్చే ఎస్సారెస్పీ రెండో దశ నీటిని అధికారులు నిన్న సాయంత్రం 5 గంటలకు నిలిపివేశారు. ఈనెల 17 వరకు నీళ్లు రావాల్సి ఉండేది. అయితే, కరీంనగర్ జిల్లాలో వేసవిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి నిల్వల కోసం అక్కడి లోయర్ మానేరు డ్యామ్ నుంచి మొదటి దశ ద్వారా రెండో దశకు ఈనెల 12 వరకే నీటిని వదిలారు. తాగునీటి సమస్యను దృష్టిలో పెట్టుకుని నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.