భారత్ పర్యటనలో ఉన్న బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వాతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. కీలక ఖనిజాలు, భద్రత, వాణిజ్యంపై ఇరువురు నేతలు దృష్టి సారించారు. వచ్చే ఐదేళ్లలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం 20 బిలియన్ డాలర్లకు మించి విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. లాటిన్ అమెరికాలో భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా బ్రెజిల్ ఉందని మోదీ పేర్కొన్నారు.