AP: ఉచితంగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ కోసం స్వర్ణ గ్రామ-స్వర్ణ వార్డులు, అంగన్వాడీల్లో ప్రభుత్వం ప్రత్యేక క్యాంపులు నిర్వహించనుంది. తొలి విడత ఈనెల 15 నుంచి 18 వరకు, రెండో విడత ఈనెల 21 నుంచి 24 వరకు అవకాశం ఉంటుంది. అప్డేట్ లేకపోతే విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 12.09 లక్షల మంది తమ డేటాను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది.