NGKL: దశాబ్దాల కాలంగా పెండింగ్లో జడ్చర్ల-కొల్లాపూర్-నంద్యాల రైల్వే లైన్ సాధన కోసం భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) పోరాటానికి సిద్ధమైంది. ఈ నెల 12వ తేదీన ఉదయం 10:30 నిమిషాలకు కొల్లాపూర్ పట్టణంలోని NTR చౌరస్తాలో నిర్వహించనున్న ‘కొల్లాపూర్ గర్జన’ మహాధర్నాను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండీ ఫయాజ్ పిలుపునిచ్చారు.