BDK:దమ్మపేట మండల 108 అంబులెన్స్ సేవలను (GVK EMRI) గ్రీన్ హెల్త్ సర్వీస్ కేంద్ర కార్యాలయం, హైదరాబాదు నుంచి వచ్చిన ఆడిటర్లు ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో అడిట్ సూపర్వైజర్ కిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబులెన్స్‌లో ఉన్న మెడికల్ పరికరాల పనితీరు, మందుల నిల్వలు, వాటి గడువు తేదీలు, నిర్వహణ రికార్డులు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు.