దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం నమోదు చేసిన రాష్ట్రాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నిలిచాయి. జాతీయ స్థాయిలో సగటున 3.40% ద్రవ్యోల్బణం ఉండగా, తెలంగాణ ఏకంగా 5.83%తో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఏపీ 4.05%తో రెండో స్థానంలో ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో సామాన్యులు బడ్జెట్ భారంతో ఇబ్బంది పడుతున్నారు. జాతీయ సగటు కంటే ఇక్కడ ధరల వేగం చాలా ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.