ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పర్వతాల్లో ఈ నెల 19 నుంచి చార్ ధామ్ యాత్ర సందడి మొదలుకానుంది. అక్షయ తృతీయ సందర్బంగా ఉత్తరకాశీ జిల్లాలోని గంగోత్రి, యమునోత్రి ఆలయాలను తెరవడంతో యాత్ర ప్రారంభమవుతుంది. ఈ నెల 22 నుంచి రుద్రప్రయాగ్ లోని కేదార్ నాథ్, 23 నుంచి చమోలీలోని బద్రీనాథ్ ఆలయాల్లోకి భక్తులను అనుమతిస్తారు.