TG: ఎస్సీ వర్గీకరణ, కులగణన విషయంలో తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ప్రసంగించిన సీఎం రేవంత్ గర్వంగా ప్రకటించారు. తాము మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని, అయితే అది అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ఉండాలని కోరారు. జనగణనతో పాటే కులగణన చేపట్టి అణగారిన వర్గాల గణాంకాలను వెలుగులోకి తెచ్చామని, ఇది బహుజన హక్కుల సాధనలో కీలక అడుగు అని ఆయన పేర్కొన్నారు.