AP: తిరుమలలో జరిగిన పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు. పద్మావతి అతిథిగృహం సమీపంలో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సమాచార సాంకేతితను పెద్దఎత్తున తీసుకొస్తున్న మంత్రి లోకేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పీయూష్ మాట్లాడుతూ.. ‘ఏటా నా పుట్టినరోజుకు ముందు శ్రీవారి ఆశీస్సులు తీసుకుంటా. ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలి’ అని కోరుకున్నారు.