కాకినాడకు చెందిన TDP జాతీయ ఉపాధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్‌ను మళ్లీ రాజ్యసభకు పంపేందుకు అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. గురువారం కూటమి అధినేతలు సమావేశమై నాలుగు రాజ్యసభ సీట్లపై చర్చించారు. సిట్టింగ్ ఎంపీ సానా పదవీకాలం ముగియడంతో, మరోసారి ఆయనకు అవకాశం ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించినట్లు చర్చ నడుస్తుంది.