పార్వతీపురం MLA బోనెల విజయచంద్ర సూచనల మేరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్వతీపురం పట్టణ పరిధిలో సైకిల్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, గ్రీన్ ఎనర్జీ వినియోగం, పర్యావరణ సమతుల్యత వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశ్యమని టీడీపీ నాయకులు అన్నారు.