HNK: కాకతీయ విశ్వవిద్యాలయం (KU) పరిధిలోని పలు హాస్టళ్లు, మహిళా హాస్టళ్లు, లా హాస్టళ్లు, కామన్ మెస్ సేవలు నేటి నుంచి పునఃప్రారంభించనున్నట్లు హాస్టళ్ల డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. PG నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 8 నుంచి ప్రారంభం కానుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే PG రెండో సెమిస్టర్ విద్యార్థులకు ఈ నెల 9 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.