TPT: తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే పులివర్తి నాని, కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు, జ్ఞాపికను అందజేశారు.