ELR: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వినూత్నంగా సైకిల్ యాత్ర నిర్వహించి ప్రజల్లో చైతన్యం నింపారు. కాలుష్య నియంత్రణకు సైకిల్ వినియోగం ఉత్తమమని చెబుతూ.. పచ్చదనం కోసం ఆయన మొక్కలు నాటారు. ప్రకృతిని కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యతని, భావితరాలకు చెట్ల పెంపకమే నిజమైన సంపద అని ఆయన పిలుపునిచ్చారు.