ELR: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పోలవరం నియోజకవర్గంలో ట్రైకార్ ఛైర్మన్ బొరగం శ్రీనివాసులు పర్యావరణ చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ.. ఆయన స్వయంగా సైకిల్ తొక్కుతూ నియోజకవర్గంలో పర్యటించారు. అనంతరం అధికారులతో కలిసి మొక్కలు నాటి, మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పిలుపునిచ్చారు.