KDP: YVU గణితశాస్త్ర విద్యార్థి గట్టు వెంకట రాముడుకు డాక్టరేట్ లభించింది. ఆచార్య కాత్యాయని పర్యవేక్షణలో హీట్ ట్రాన్స్‌ఫర్‌పై ఆయన చేసిన పరిశోధనకు గాను ఈ పీహెచ్డీ పట్టాని అందజేశారు. రాముడు తన పరిశోధనలో భాగంగా రాసిన నాలుగు వ్యాసాలు అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధన ఆటోమొబైల్, బయోమెడికల్ రంగాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు.