AP: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖ ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ.. ‘వర్సిటీకి కావాల్సిన విద్యుత్ వందశాతం ఇక్కడే ఉత్పత్తి కావాలి. క్యాంపస్‌లో విరివిగా మొక్కలు నాటాలి’ అని సూచించారు. అలాగే, నెట్ జీరో కార్యక్రమంలో భాగంగా ఆయన అక్కడి నుంచి సైకిల్‌పై నోవాటెల్‌కు చేరుకోనున్నారు.