BPT: చింతాయపాలెంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘ఖేత్ బచావో అభియాన్’ సదస్సు నిర్వహించారు. కౌలు రైతులు సీసీఆర్సీ కార్డులు తీసుకుంటేనే బీమా, రుణాలు, ప్రభుత్వ రాయితీలు అందుతాయని ఏవో సుమంత్ తెలిపారు. మట్టి పరీక్షల మేరకే పొలాలకు ఎరువులు వేయాలన్నారు. పారదర్శకత కోసం ‘ఏపీఏఐఎంఎస్ 2.0’ యాప్ ద్వారా ఎరువుల పంపిణీ జరుగుతుందన్నారు. రైతులు పంట వివరాలు నమోదు చేయాలన్నారు.