ATP: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవరకొండ గిరి ప్రదక్షిణ మార్గం చుట్టూ మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్లాంటేషన్ కార్యక్రమంలో కూటమి నాయకులు, పర్యావరణ ప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేవరకొండ పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. నాటిన మొక్కలను సంరక్షించాలని పిలుపునిచ్చారు.