JGL: మెట్పల్లి సర్కిల్ పరిధిలోని పలు దేవాలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న భార్యాభర్తలను పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వెల్లుల్ల గ్రామానికి చెందిన ఆరే శంకర్, ఆరే అనూషలను సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 20 గ్రాముల బంగారం, 1.250 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సురేష్ బాబు తెలిపారు.