కృష్ణా: మచిలీపట్నంలో గత ప్రభుత్వం అందించిన జగనన్న ఇళ్ల పట్టాలను రద్దు చేసే అధికారం ఏ ఒక్కరికీ లేదని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. టీడీపీ ఇన్ఛార్జ్లు ఇళ్లకు వచ్చి మూడు సెంట్ల స్థలం ఇస్తామని పాత పట్టాలు అడిగితే ఎవ్వరూ ఇవ్వవొద్దని లబ్ధిదారులకు సూచించారు. కూటమి ప్రభుత్వం త్వరలో కూలిపోతుందని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు.