KRNL: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం పెద్దకడబూరు మండలం హెచ్. మురవణిలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు బొయ సొంటెన్న, గ్రామ పంచాయతీ కార్యదర్శి చిన్నయ్య, సాగునీటి సంఘం అధ్యక్షుడు సత్యన్న గౌడ్, యూనిట్ ఇన్ఛార్జ్ దుమ్ముల శివ, ఫీల్డ్ అసిస్టెంట్ చెన్నకేశవ, నాయకులు జనార్ధన్ పాల్గొన్నారు.