AP: వైఎస్సార్ కడప జిల్లా నందిపల్లిలోని నందీశ్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంతో జరుగుతోంది. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పండితులు జగన్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. జగన్ రాకతో ఆలయంలో సందడిగా మారింది.