TG: ఆలయాల్లో భక్తుల విశ్వాసాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు CM రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. బాసర ఆలయ ప్రాంగణంలో భారీ వృక్షాలు నాటాలని.. హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు. పార్కింగ్ ప్రాంతంలో సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆలయ పరిసరాల్లో EVలకు మాత్రమే అనుమతి ఇవ్వాలని.. VIP వాహనాలు కూడా బయటే పార్కింగ్ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు.