AP: పట్టాదారు పాస్ పుస్తకాలు ఏడాదిలోగా పంపిణీ జరగాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. సమస్యలు 4 దశల్లో పరిష్కారం అయ్యేలా.. నెల్లూరు కలెక్టర్ హిమాంశు శుక్లా అనుసరిస్తున్న విధానాన్ని అందరూ అనుసరించాలని సూచించారు. కలెక్టర్ శుక్లా చాలా బాగా పనిచేస్తున్నారని కొనియాడారు. జలధార కార్యక్రమం నిర్వహణలో అన్నమయ్య కలెక్టర్ పనితీరును సీఎం ప్రశంసించారు.