ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL కస్టమర్ల కోసం అదిరిపోయే ప్లాన్ ప్రకటించింది. కేవలం రూ.599లతో రీఛార్జ్ చేస్తే, 70 రోజుల వ్యాలిడిటీ వచ్చేలా ఆఫర్ ప్రకటించింది. ఇందులో ప్రతి రోజుకు 3GB హై స్పీడ్ డేటా అందించనుంది. దానికి తోడు అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 మెసేజులు పంపించుకోవచ్చు. బడ్జెట్ ధరలో ఎక్కువ డేటా కోరుకునే వారికి ఈ ప్లాన్ బెస్ట్ అని విశ్లేషకులు చెబుతున్నారు.