TG: రాష్ట్రంలో సాదాబైనామాల పరిష్కారాలు తాజాగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది రైతులు క్రమబద్ధీకరణకు ఎదురుచూస్తున్నారు. సాదాబైనామా రైతు సమర్పించే అఫిడవిట్ పూర్తి ఆధారాలతో ఉండటంతో పాటు 30 రోజుల పాటు అభ్యంతరాలేవీ రాకుంటే క్రమబద్ధీకరణ సులువుగా పూర్తవుతుందని రెవెన్యూ వర్గాలు సూచిస్తున్నాయి.