నిర్ణయాత్మక స్థానాల్లో మహిళలు ఉంటే పర్యావరణ పరిరక్షణకు, సేంద్రియ ఉత్పత్తులకు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆహార ఉత్పత్తిలో సగ భాగం మహిళలదే. వీరికి భూమిపై హక్కులు, సాంకేతికత అందిస్తే ఉత్పాదకత 20-30% పెరుగుతుంది. అలాగే సాంప్రదాయ ఇంధన రంగానికంటే పర్యావరణ హితమైన సౌరశక్తి రంగంలో మహిళల ప్రాతినిధ్యం(40%) చాలా ఎక్కువగా ఉండటం విశేషం.