TG: రాజన్న సిరిసిల్ల జిల్లా పోతిరెడ్డిపల్లె గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపింది. గ్రామానికి చెందిన సద్దుల పూర్ణ ఇంటి దగ్గర కట్టేసిన లేగ దూడను చంపి తినేయడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఉదయం లేచి చూసిన కుటుంబ సభ్యులు దూడ మృతదేహాన్ని చూసి షాకయ్యారు. గ్రామ పరిసరాల్లో తిరుత సంచరించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. చిరుతను పట్టుకోవాలని అటవీ సిబ్బందిని కోరుతున్నారు.