AP: సీఎం ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్ బాధ్యతలు స్వీకరించారు. ఫిబ్రవరి 28న సీఎస్‌గా ఆయన పదవీ విరమణ చేయగా ప్రభుత్వం ఆయనను సీఎం ఎక్స్అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఈ నేపథ్యంలో సచివాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం, టీటీడీ వేదపండితుల ప్రత్యేక పూజల అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు.