AP: తక్కువ ధరలకే భూములు కట్టబెట్టడం దారుణమని మాజీ మంత్రి పేర్నినాని అన్నారు. ‘CBN ప్రభుత్వం 99 పైసలకే కోట్లాది రూపాయలు విలువచేసే భూములను బడా బాబులకు కట్టబెడుతోందని తెలిపారు. 99 పైసలకి భూములు కేటాయించిన జీవోలు కొన్ని మాత్రమే బయటపడ్డాయని, కనిపించకుండా ప్రభుత్వం దాచిపెట్టిన జీవోలు ఇంకా చాలా ఉన్నాయని చెప్పారు. ప్రజల భూములపైనే కాకుండా దేవుడి భూములపై కూడా కన్నేశారని విమర్శించారు.