WNP: జిల్లాలో భానుడు భగభగడుతూ ఎండలు దంచికొడుతున్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా పానగల్ మండలం రేమొద్దులలో 41.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పానగల్, రేవల్లి 41.5°C, శ్రీరంగాపూర్, ఎదుల, దగడ 41.4°C, కేతేపల్లి 41.3°C, వెలుగొండ 40.0°C, విలియంకొండ, గోపాల్ పేట, పెద్దమందడి 40.9°C, మదనపూర్ 40.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.