మధ్యప్రదేశ్లోని బ్యాంకు దోపిడీ కలకలం రేపింది. దుండగులు తుపాకులతో లోపలికి చొరబడి కస్టమర్లు, బ్యాంకు సిబ్బందిని బెదిరించి రూ.15 కోట్ల విలువైన బంగారం(10 కేజీలు), రూ.35 లక్షల నగదుతో పరారయ్యారు. ఐదుగురు దుండగులు కస్టమర్ల ముసుగులో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శాఖ బ్యాంకులో ప్రవేశించారు. కేవలం 20 నిమిషాల్లో బంగారం, వెండి, రూ.35 లక్షల నగదుతో ఉడాయించారు.