AP: బీజేపీ నేత విష్ణువర్ధన్‌పై పోలీసులు ఆంక్షలు విధించారు. కదిరి నరసింహస్వామి రథోత్సవంలో పాల్గొనవద్దని సూచించారు. కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ ఆదేశాలతోనే తనపై ఆంక్షలు విధించారని విష్ణువర్ధన్ ఆరోపిస్తున్నారు. రథోత్సవంలో పాల్గొని తీరుతానని ఆయన తేల్చి చెప్పారు. ఈ క్రమంలో విష్ణువర్ధన్ ఇంటి దగ్గర పోలీసులను మోహరించారు.