తూ.గో: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ప్రత్యేక కార్యక్రమాన్ని కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో ఇవాళ నిర్వహిస్తున్నట్లు ఆర్డీవో కె. ఆనందరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి నియోజకవర్గ స్థాయిలో వచ్చే అర్జీలను జిల్లా అధికారులు, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు స్వయంగా స్వీకరించనున్నారు. ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.