KRNL: పత్తికొండ సచివాలయం-6లో మహిళా పోలీసుగా పనిచేస్తున్న రాజేశ్వరి అనారోగ్యంతో హైదరాబాద్లోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందారు. ఆమె మృతి వార్తతో మాజీ ఎంపీపీ ఎస్. నాగరత్నమ్మ, కేడీసీసీ బ్యాంకు మాజీ వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డి, మేధావుల ఫోరం ప్రతినిధి అధ్యక్షుడు ఆస్పరి సాయిబాబా తదితరులు ఆమె భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.