WGL: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పనులను త్వరగా పూర్తి చేయాలని HNK జిల్లా కలెక్టర్, గ్రేటర్ వరంగల్ ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ఆదేశించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఆమె మాట్లాడుతూ.. ఇప్పటివరకు 59 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని పేర్కొన్నారు. బూత్ స్థాయి సిబ్బంది వేగం పెంచాలని ఆమె సూచించారు.