W.G: తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన ఒక వ్యాపారితో పాటు మరో ఇరువురిని కాకినాడలోని ఒక హోటల్లో త్రీ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అనుమానంగా రెండు కార్లలో సంచరిస్తున్న వారి నుంచి ఒక బ్యాగు, నగదు లెక్కించే మిషన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. వారు ప్రయాణిస్తున్న కార్లపై మీడియా, గవర్నమెంట్ స్టిక్కర్లు ఉండటంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.