NRPT: నారాయణపేట పట్టణ శివారులోని వల్లంపల్లి రోడ్డులోని మురుగునీటి కాలువలో బాలుడి మృతదేహం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. పసికందును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు పారిశుద్ధ్య సిబ్బంది సహాయంతో పసికందను బయటికి తీసి జిల్లా ఆసుపత్రికి పంపించారు. బాలుడు ఎలా చనిపోయాడు అనే విషయాలు తెలియాల్సి ఉంది.