MHBD: గంగారం మండలంలో శుక్రవారం మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా స్థానిక రైతు వేదికలో ఉదయం 9:30 గంటలకు కార్యక్రమం జరగనుంది. మండలంలోని 12 గ్రామ పంచాయతీల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.