KMM: సత్తుపల్లిలో సంచలనం సృష్టించిన భారీ సైబర్ నేరం కేసులో మరో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పట్టణ సీఐ టి. శ్రీహరి తెలిపారు. ఖమ్మంకు చెందిన నల్లనాగుల శ్వేతన్ అనే వ్యక్తి 2023లో చండ్రుగొండ సీఎస్ బ్యాంకులో ఖాతా తెరిచాడు. ఈ అకౌంట్‌ను ‘మ్యూల్ అకౌంట్’ గా వాడుతూ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 27మందిని అరెస్ట్ చేశారు.