ములుగు జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జిల్లా ప్రశిక్షణ అభియాన్–2026 గురువారం ప్రారంభమైంది. జిల్లా అధ్యక్షుడు బలరాం అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరిగే ఈశిబిరంలో పార్టీ సిద్ధాంతాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలపై శిక్షణ ఇవ్వనున్నారు.