NDL: కరెంటు షాక్తో తీవ్రంగా గాయపడిన తమ్మడపల్లి గొర్రెల కాపరి రామపుల్లయ్యకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరా రెడ్డి అండగా నిలిచారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందేలా చూసిన ఆమె, విద్యుత్ శాఖ నుంచి మంజూరైన రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ శ్రీనివాసులు, ఏఈ షబ్బీర్ హుస్సేన్, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.