HYD: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ పోలీసులు దాడి చేసి కల్తీ ఆహార పదార్థాలను పట్టుకున్నారు. ఈ దాడిలో 5,000 లీటర్ల కల్తీ వంట నూనె, 5 టన్నుల గోధుమ పిండి స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇద్దరిని అరెస్టు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.