KDP: మైలవరం రిజర్వాయర్ విభాగంలో EEగా విధులు నిర్వహిస్తున్న యు.రమేశ్ సూపరింటెండింగ్ ఇంజినీర్ (SE)గా పదోన్నతి పొంది కడప GNSSకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా మైలవరం ఎస్సై డాక్టర్ సి. శ్యాంసుందర్ రెడ్డి ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి సన్మానించారు. పదోన్నతి సాధించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.