CTR: జీడినెల్లూరు మండలంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చిన్నవేపంజేరి రెవెన్యూ గ్రామంలోని మహా దేవమంగళం సీడ్ మల్టిప్లికేషన్ ఫార్మ్స్లో వ్యవసాయ శాఖకు చెందిన 46.69 ఎకరాల భూమిని పీఎం కుసుమ్ పథకం కింద మంత్రివర్గ సమావేశంలో కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారు.