AP: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు CM చంద్రబాబు కీలక సూచన చేశారు. నేడు సైకిళ్లు, ఈ సైకిళ్లపై ప్రయాణించాలని, ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రజలంతా కలసిరావాలన్నారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతన్న సీఎం.. గాలి, నీరు, నేల కలుషితం కాకుండా అందరూ కృషి చేయాలని కోరారు.