అన్నమయ్య: సుండుపల్లి మండ లంలోని పెద్దినేనికాలువ గ్రామం బండకాడ ఈడిగపల్లి సమీపంలో ఉన్న నాగారపమ్మ తిరునాల ఉత్సవాలు శనివారం నుంచి సోమవారం వరకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలపారు. శనివారం ఉదయం అమ్మవారికి అభి షేకం, కుంకుమార్చన కార్యక్రమాలతో ఉత్స వాలు ప్రారంభమవుతాయన్నారు. తిరుపతి, అన్నమయ్య జిల్లాల నుంచి కూడా భక్తులు రానున్నట్లు చెప్పారు.